top of page
భారతరత్న డా బీ ఆర్ అంబేద్కర్ గారి  125 వ జయంతి వేడుకలు ది 14.4.2016 తారీఖున సంచార్ భవన్, రాజమహేంద్రవరం లో రంగ రంగ వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు డా బీ ఆర్ అంగేడ్కర్ గారికి మన జనరల్ మేనేజర్ శ్రీ ఆశపు శ్రీనివాసరావు, ITS గారు పూల మాల వేసి ఆయనకు నివాళి అర్పించారు. ఆ విధంగా ప్రారంభమైన వేడుకలు రాత్రి 10 గంటల వరకు నిర్విఘ్నంగా అధ్బుతంగా జరిగాయి. ఆ వేడుకల విశేషాలు మీ కోసం.....
ది 10.03.2016 న సేవా ఆఫీసు, సంచార్ భవన్ నందు జిల్లా ప్రెసిడెంట్ శ్రీ బండి సోమరాజు గారి ఆద్వర్యం లో జిల్లావ్యాప్తంగా సేవా బ్రాంచుల ఏర్పాటు కొరకు మరియు ఆయా బ్రాంచుల కార్యవర్గాన్ని ఏర్పాటు చేయుటకు సమావేశం జరిగినది. ఈ సమావేశంలో నూతన బ్రాంచి కార్యవర్గాన్ని మన జిల్లా కార్యదర్శి శ్రీ సేవా ప్రసాద్ గారు అభినందించారు. బ్రాంచి నూతన కార్యవర్గ వివరాలకు ఈ క్రిందనీయబడిన లింకుని నొక్కండి
ది 26.2.2016 న సేవా ఆఫీసు, సంచార్ భవన్ నందు జిల్లా ప్రెసిడెంట్ శ్రీ బండి సోమరాజు గారి ఆద్వర్యం లో ఎక్జిక్యూటివ్ బాడీ మీటింగు జరిగినది. ఈ సమావేశానికి 25 మంది ప్రతినిధులు హాజరయి ఈ సభను విజయవంతం చేసినారు. ఈ సభలో పలు విషయాలు చర్చకు వచ్చినవి. ఈ సమావేసం యొక్క పూర్తి మినిట్స్ కొరకు ఈ క్రింది లింకు ని నొక్కండి 

ది 1-1-2016 తారీఖున మన ప్రియతమ జనరల్ మేనేజర్ శ్రీ ఆశపు శ్రీనివాసరావు, ITS గారు sewabsnleastgodavari నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా sewa మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.మరియు శ్రీ జాన్ వెస్లీ, ఇంటర్నేషనల్ స్పీకర్ గారు హాజరైనారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మన జనరల్ మేనేజర్ గారు తమ అమూల్యమైన సందేశాన్నిచ్చారు. 

ది 18-12-2015 తారీఖున sewa basnl eastgodavari ఆధ్వర్యం లో జరిగిన thanks giving మీటింగ్ రంగ రంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మన ప్రియతమ జనరల్ మేనేజర్ శ్రీ ఆశపు శ్రీనివాసరావు, ITS గారు మరియు శ్రీ జాన్ వెస్లీ, ఇంటర్నేషనల్ స్పీకర్ గారు హాజరైనారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మన జనరల్ మేనేజర్ గారు తమ అమూల్యమైన సందేశాన్నిచ్చారు. 

ది 6-12-2015 తారీఖున భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్.అంబేడ్కర్ గారి 59 వ వర్ధంతి పురస్కరించుకొని sewa bsnl eastgodavari ఆధ్వర్యంలో ఉదయము 8 గంటలకు సంచార్ భవన్, రాజమండ్రి నందు జనచైతన్య మండలి వారిచే నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శింపబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జనరల్ మేనేజర్ శ్రీ ఆశపు శ్రీనివాసరావు, ITS గారు మరియు శ్రీ జీవీ హర్షకుమార్, మాజీ పార్లమెంటు సభ్యులు హాజరయ్యాయారు. 

 

తదనంతరం కాన్ ఫెరెన్స్ హాల్, సంచార్ భవన్ నందు శ్రీ బండి సోమరాజు, జిల్లా ప్రెసిడెంట్ గారి అద్యక్షత లో మొదలైన సభలో మన జనరల్ మేనేజర్ శ్రీ ఆశపు శ్రీనివాసరావు, ITS గారిచే sewabsnleastgodavari వెబ్ సైట్ ఆవిష్కరణ కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా మన సేవా జిల్లా కార్యదర్శి శ్రీ పులిదిండి శ్రీధర్ ప్రసాద్ గారు తమ తొలిపలుకులని వినిపించారు. తదనంతరం ఈ సభలో పలువురు ప్రముఖులు డా.బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తమ ప్రసంగాలతో ఆహూతులను రంజింపచేసారు.  శ్రీ ఐ. సూర్యచంద్రా రావు గారి వందన సమర్పనతో ఈ సభ దిగ్విజయంగా ముగిసింది. 

This site is designed, developed and maintained by Sri Dasari Vara Prasad, JTO, Prathipadu

bottom of page