top of page
Dr BR అంబేడ్కర్ గారి quotes
  1. గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి. 

  2. నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.

  3. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి..అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా.

  4. నా దేశ సమస్యలకూ, నా జాతి సమస్యలకూ మధ్య సంఘర్షణ వస్తే ముందు నా జాతికి ప్రాముఖ్యం ఇస్తాను.నేనూ,నా దేశం ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యమైనది.

  5. మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడచిన కాలమూ తిరిగిరాదు.

  6. ప్రతి స్త్రీని,ప్రతి పురుషుని శాస్త్ర దాస్యం నుంచి విముక్తుల్ని చేయండి.

  7. మేకల్ని బలి ఇస్తారు కానీ పులుల్ని బలి ఇవ్వరు.

  8. కౄరత్వం కంటే నీచత్వమే హీనమైనది.

  9. కులం పునాదుల మీద మీరు దేనిని సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు.

  10. దేశానికి గానీ,జాతికి గానీ సంఖ్యాబలమొక్కటే చాలదు.వారు ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో,ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది.

  11. కళ్లు అంటే విజ్ఞానపు వాకిళ్లు. వాటిని బద్దకంతో నిద్రకు అంకితం చేస్తే భవిష్యత్ తలుపులు తెరుచుకోకపోగా అంతా అంధకారమే మిగులుతుంది. అలాకాక సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ముందుకు దూసుకుపోతే అంతు తెలియని జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ జ్ఞానమే ఇంకా ఇంకా శోధించాలనే తపనలకు మూలం అవుతుంది. అదే అనంత శిఖరాల  అంచులపై మనల్ని నిలిపేలా చేస్తుంది. ఆ శక్తి కేవలం విద్యకే వుంది.

     

     

     

     

     

     

     

     

     

This site is designed, developed and maintained by Sri Dasari Vara Prasad, JTO, Prathipadu

bottom of page